విద్యుదాఘాతంతో వెల్డర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వెల్డర్‌ దుర్మరణం

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

కశింకోట: మండలంలోని జి.భీమవరం గ్రామంలో వెల్డింగ్‌ పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ అల్లు స్వామి నాయుడు మంగళవారం అందించిన వివరాల ప్రకారం ...జి. భీమవరం గ్రామానికి చెందిన బత్తిన రాజారావు (33) తన వృత్తిలో భాగంగా సమీపంలోని పొలాల్లో ఉన్న షెడ్డులో వెల్డింగ్‌ పని చేసేందుకు గొంతిన శ్రీను, పాతాళ నాగశ్రీను అనే వ్యక్తులతో కలిసి సోమవారం రాత్రి వెళ్లారు. అక్కడ రాజారావు వెల్డింగ్‌ మిషన్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే ఆకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తనతోపాటు వచ్చిన శ్రీను, నాగశ్రీను మెయిన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి రాజారావును వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేసరికి రాజారావు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుని భార్య అరుణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు. ఎస్‌ఐ లక్ష్మణరావు దర్యాప్తు నిర్వహిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement