నర్సీపట్నం: నాతవరం మండలం సరుగుడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లోచల వరుణ్ సమక్షంలో దద్దుగుల గ్రామానికి చెందిన పది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. మంగళవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ససర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని గణేష్ సూచించారు. కార్యక్రమంలో నాయకులు లోచల ప్రసాద్, గొల్లపల్లి కృపారాజు, భీమిరెడ్డి శ్రీను, బంగారు మంగరాజు తదితరులు పాల్గొన్నారు.


