జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీ | - | Sakshi
Sakshi News home page

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తనిఖీ

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

నర్సీపట్నం: స్థానిక సబ్‌ జైల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసినాయుడు మంగళవారం సందర్శించారు. ఇక్కడ ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఆహారం, తాగునీరు, తదితర వాటిపై ఆరా తీశారు. విచారణ ఖైదీలతో మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకున్నారు. బెయిల్‌ సౌకర్యం పొందేందుకు ఉచిత న్యాయ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు. ప్యానెల్‌ అడ్వకేట్‌ దేవ్‌ విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement