పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

మద్యం విక్రేత అరెస్టు

మునగపాక: మండలంలోని మల్లవరం శివారు మద్యం విక్రయిస్తున్న మహిళను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.లక్ష్మీనాయుడు తెలిపారు. వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. మల్లవరం గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో సర్వసుద్ది అప్పలరాజనే మహిళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించి ఆమె వద్ద నుంచి 11 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని ఆరెస్టు చేశారు. ఆయన వెంట ఎస్‌ఐ కేఎస్‌ గణేష్‌,ట్రైనీ ఎస్‌ఐ ఇంద్రకుమార్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

నాతవరం: పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం సహాయ సంచాలకులు కె. ఝాన్సీలక్ష్మి తెలిపారు. చెర్లోపాలెంలో మంగళవారం రైతులకు శిక్షణ ఇచ్చి అనంతరం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పంటకోత సమయంలోను నిల్వ పద్ధతుల్లోను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వరి విత్తనం నుంచి పంట విక్రయించే వరకు వాడే పనిముట్లు తదితర అంశాలపై తెలియజేశారు. ఏవో జి. సుగుణ మాట్లాడుతూ ప్రస్తుతం వరి చేనులో ఆశించిన తెగుళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మద్దిలపాలెం: ఆదివాసీ హక్కులు, గిరిజన చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజా స్వామ్య హక్కుల పరిరక్షణకు బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని ఏచూరి భవన్‌లో సీపీఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బిర్సా ముండా 151వ జయంతి వారోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 1/70, పీసా వంటి గిరిజన చట్టాలను బలహీనపరుస్తూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు.

ఆదివాసీ హక్కులు పరిరక్షణకు ఉద్యమించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement