కశింకోట: కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకు చెందిన ఇద్దరు బాలురు రాష్ట్ర స్థాయి కత్తిసాము పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి కత్తి సాము పోటీలో మళ్ల ప్రవీణ్, కె.నవీన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం ఎన్.జె.వి ప్రసాద్ మంగళవారం తెలిపారు. వీరు బుధవారం నుంచి మూడు రోజులపాటు నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయిపోటీలో పాల్గొంటారన్నారు. వీరిని హెచ్ఎంతోపాటు పీడీలు వి.ప్రభాకరరావు, పెంటకోట కమల, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.


