‘కూచిపూడి’లో కశింకోట చిన్నారుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

‘కూచిపూడి’లో కశింకోట చిన్నారుల ప్రతిభ

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

కశింకోట: మండల కేంద్రం కశింకోటకు చెందిన చిన్నారులు రాజమండ్రిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, మిరాకిల్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల రాజమండ్రిలో ’ఓం శివోహం’ పేరుతో వెయ్యి మంది చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ప్రదర్శనలో కశింకోటలోని రాష్ట్ర అర్చక ఎగ్జామినర్‌ రేజేటి శ్రీరామాచార్యులు, ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు రేజేటి రామచరణాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజరాజేశ్వరి కూచిపూడి కళామిత్ర నాట్యాచారిణి ఎ.కృతిక పర్యవేక్షణలో చిన్నారులు లావణ్య, భాను, యామిని, తనుజ్ఞ, శరణ్య, అనఘ, చేతన, విజ్ఞాత్రి, జ్ఞానేశ్వరి, మహాలక్ష్మి, యశస్విని, మోక్షిత, యశ్విక, హిత్విశ్రీలు పాల్గొని విజయవంతంగా ప్రదర్శన ఇచ్చారు. తమ ప్రతిభతో వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement