ఓపెన్‌ స్కూళ్లలో ప్రవేశాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూళ్లలో ప్రవేశాలపై అవగాహన

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

పాడేరు : చదువుకు దూరంగా ఉన్న చదువును మద్యలో ఆపేసిన, రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేకపోయిన ఎవరైనా వయోజనులు, బాలబాలికలు ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలు పొంది విద్యావంతులుగా మారాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.శశికుమార్‌ పిలుపునిచ్చారు. ఐసీడీఎస్‌ ఆద్వర్యంలో మండలంలోని డోకులూరు, రాయిగెడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అంగన్‌వాడీ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయా చోట్ల ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల పోస్టర్లను పాఠశాల సిబ్బంది, ఐసీడీఎస్‌ అధికారులతో ఆవిష్కరించారు. టెన్త్‌లో చేరే అభ్యర్థులు చదవడం, రాయడం వంటి కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. అడ్మిషన్‌ పొందేందుకు ఈనెల 30 వరకు గడువు ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్‌ సీడీపీవో శారదాదేవి, డీఈవో కార్యాలయ సిబ్బంది మురళీమోహన్‌, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement