డుంబ్రిగుడ: గిరిజన మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కుట్టు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అరకులోయ కేంద్రంలోని స్వంథన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ ఉమెన్ సూయింగ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుకు సహకరిస్తున్న అశ్విన్‌కు ట్రస్టు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ట్రస్ట్ ప్రతినిధులు, శిక్షణ పొందుతున్న మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


