ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

చింతపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు భద్రతా చర్యలు చేపడుతున్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. సోమవారం మండలంలోని తాజంగి, లంబసింగి పంచాయతీ కేంద్రాల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఏఎస్పీ మహిందర్‌ సిన్హాతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల రోజున శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ కోరారు. ఆయన వెంట సీఐ సింహాచలం, ఎస్‌ఐ వీరబాబు తదితరులున్నారు.

జిల్లా ఎస్పీ తుహిన్‌సిన్హా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement