రోలుగుంట: బుచ్చింపేట జిల్లా పరిషత్ విద్యార్థిని అనిమిరెడ్డి జ్ఞానేశ్వరి ఈ నెల 26 న జరగనున్న భారత్ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మాక్ అసెంబ్లీ నిర్వహణకు ఎంపికై నట్టు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఇటీవల చోడవరం నియోజకవర్గం స్థాయిలో జరిగిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో బుచ్చింపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన అనిమిరెడ్డి జ్ఞానేశ్వరి పాల్గొని జిల్లా స్థాయిలో గెలుపొందింది. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీలో చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం బుచ్చింపేట జిల్లా పరిషత్ నుంచి ఎంపిక కావడంతో పాఠశాలకు గ్రామానికి మంచి గుర్తింపు రానుందని పాఠశాల సిబ్బంది, గ్రామ యువత అభినందనలు తెలిపారు.


