మాజీ ఎంపీపీ వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీపీ వైఎస్సార్‌సీపీలో చేరిక

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

బుచ్చెయ్యపేట: మేజర్‌ పంచాయతీ వడ్డాదిలో మాజీ ఎంపీపీ దాడి గోవింద 200 మందితో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి మాజీ మంత్రి,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ సమక్షంలో కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తమ పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గ్రామానికి చెందిన జనసేన యూత్‌ లీడర్‌ సయ్యపురెడి జనార్ధనరావు, బీజేపీ నాయకుడు శిరిగిరిశెట్టి చిన వెంకయ్యదొర, మాజీ రేషన్‌ డీలర్‌ దొండా నానాజీ నాయకులు శిరిగిరిశెట్టి లక్ష్మీనారాయణ, రంగారావు, వెలుగుల శ్రీనివాసరావు, గోవింద, నీలకఠ సాయి, దాడి మనోహర్‌, కురసాల గణేష్‌ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి టీడీపీలో ఎంపీపీ పదవి చేసిన తరవాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాకు వీఆర్వోగా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుండే నేను వైఎస్సార్‌ అభిమానిని. నేను వీఆర్వోగా పదవీ విరమణ చేసిన వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరాలని చూడగా కొన్ని కారణాల వల్ల మరలా టీడీపీలో చేరాను. నాకు మేజర్‌ పంచాయతీ వడ్డాది సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తామన్న టీడీపీ నాయకులు తమ స్వార్థ రాజకీయం కోసం సర్పంచ్‌ పదవిని తన ఇంట్లో వారికిచ్చి తనకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎంపీపీ గోవింద తెలిపారు. ఇకపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చురుకై న పాత్ర వహించి గ్రామ, మండల నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ దొండా రాంబాబు, మాజీ వైస్‌ ఎంపీపీ దొండా నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కోవెల జనార్దనరావు, వడ్డాది టౌన్‌ అధ్యక్షుడు అడపా శ్రీను, దేముడుబాబు, సయ్యపురెడ్డి కొండబాబు, బి.వరలక్ష్మి, కోరుకొండ రమణ, గుమ్మిడి ప్రసాద్‌, ఈశ్వరరావు పాల్గొన్నారు.

గొడిచర్లలో 30మంది వైఎస్సార్‌సీపీలో చేరిక

నక్కపల్లి: మండలంలో గొడిచర్ల గ్రామానికి చెందిన సుమారు 30 మంది దళితులు సోమవారం టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఉప్పాటి బాబ్జి, ఉప్పాటి నానాజీ, ఉప్పాటి దుర్గ, ఉప్పాటి దొరబాబు, ఉప్పాటి సత్యనారాయణ, ఉప్పాటి నాగేశ్వరరావు, ఉండ్రాసు ఏసు, యాసరపు స్వామి, ఉప్పాటి రాజు కుటుంబాలకు చెందిన వీరంతా వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, మాజీ సర్పంచ్‌ అల్లు రమణ, మాజీ ఎంిపీటీసీ నిట్ల గోవిందుల సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దళితులకు పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని, టీడీపీలో దళితులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప వారికి ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని వారు పేర్కొన్నారు. దళితులంటే టీడీపీ నాయకులకు చులకన భావం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెలగా వెంకటశివ, మంతెన అప్పారావు పాల్గొన్నారు.

200 మంది కూటమి నేతలువైఎస్సార్‌సీపీలో చేరిక

సత్యసాయి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

తాటిచెట్లపాలెం: భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సంత్రగచ్చి–శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 17, 24 తేదీల్లో సంత్రగచ్చి నుంచి (08031), 18, 25 తేదీల్లో ప్రశాంతి నిలయం నుంచి (08032) ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రాకపోకల సమయంలో దువ్వాడలో ఈ రైళ్లు వరుసగా తెల్లవారుజామున 3.20 గంటలకు చేరుకుంటాయి. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎర్నాకుళం–పాట్నా (06085), పాట్నా–ఎర్నాకుళం (06086) వీక్లీ స్పెషల్‌ రైళ్లను డిసెంబరు 11, 15వ తేదీల వరకు పొడిగించారు. తాంబరం–సంత్రగచ్చి (06075), సంత్రగచ్చి–తాంబరం (06076) ప్రత్యేక రైళ్లను కూడా ఈ నెల 17, 21, 18, 25 తేదీల్లో నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement