సీపీడబ్ల్యూడీ–బీఏఆర్‌సీ మధ్య అవగాహన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

సీపీడబ్ల్యూడీ–బీఏఆర్‌సీ మధ్య అవగాహన ఒప్పందం

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

మహారాణిపేట: భారత ప్రభుత్వ కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ), బాబా అణు పరిశోధనా కేంద్రం (బీఏఆర్‌సీ) విశాఖపట్నం విభాగం మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. విశాఖలోని కై లాసపురంలో ఉన్న బీఏఆర్‌సీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చాంబర్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్న బీఏఆర్‌సీ ప్రాంగణంలో 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రధాన నివాస కాలనీకి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించనున్నారు. దీనితోపాటు వివిధ దశల్లో నివాస గృహాలు, కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలో 70 నివాస గృహాలను నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.80 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. తదుపరి దశల్లో మరిన్ని నివాస గృహాలు, కార్యాలయ భవనాల నిర్మాణానికి కూడా ఈ ఒప్పందం ద్వారా మార్గం సుగమమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement