కై లాసగిరిపై త్రిశూలానికి ఎదురుగా ఏర్పాటు చేసిన నంది విగ్రహం
ఆరిలోవ: కై లాసగిరిపై పర్యాటకులకు మరో ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. డమరుకంతో కూడిన భారీ త్రిశూలం ఏర్పాటు చేసిన నాలుగు నెలల తర్వాత.. దానికి ఎదురుగా వీఎంఆర్‌డీఏ అధికారులు సోమవారం భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 8 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 15 అడుగుల పొడవు, 7 నుంచి 9 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. పూర్తిగా ఫైబర్ రీన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (ఎఫ్‌ఆర్‌పీ)తో తయారు చేయించినట్లు వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌వో రమణమూర్తి తెలిపారు.


