చింతపల్లి: స్థానిక ఏకలవ్య గురుకుల పాఠశాల నూతన విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కిల్లో పూర్ణచంద్రరావు ఎన్నికై నట్లు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రామలక్ష్మి తెలిపారు. ఆదివారం పాఠశాలలో విద్యాభివృద్ధి కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా కిల్లో పూర్ణచంద్రరావు, వైస్ చైర్మన్‌గా సీదెరి కొండమ్మతో పాటు 16 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


