పల్లెపోరుకు పటిష్టపోలీసు భద్రత | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరుకు పటిష్టపోలీసు భద్రత

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● చింతపల్లి ఏఎస్పీ మహిందర్‌ సిన్హా

చింతపల్లి: చింతపల్లి డివిజన్‌ పరిధిలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు స్థానిక ఏఎస్పీ మహిందర్‌ సిన్హా తెలిపారు. ఆదివారం ఆయన ఎంపీడీవో లాలం సీతయ్య, సీఐ సింహాచలంతో కలిసి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తొమ్మిది కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యంత సమస్యాత్మకమైన రాళ్లగెడ్డ, తాజంగి, అంజలి శనివారం, ఎర్రబొమ్మలు, కొమ్మంగి, కొత్తపాలెం, లోతుగెడ్డ తదితర ప్రాంతాలను సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియతో పాటు రానున్న ఎన్నికల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని ఏఎస్పీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement