మేఘాల కొండకుతాత్కాలిక విరామం | - | Sakshi
Sakshi News home page

మేఘాల కొండకుతాత్కాలిక విరామం

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● పాడేరు అటవీ శాఖ అధికారిదేవిరాజేశ్వరి

● మూడు వారాలు మూతపడనున్నవంజంగి

పాడేరు రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండను మరో మూడు వారాల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పాడేరు అటవీశాఖ అధికారి దేవిరాజేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కొండకు వెళ్లే రహదారులు, పరిసర ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి అటవీశాఖకు సహకరించాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement