● జెడ్పీ సీఈవో వాసుదేవరావు
చింతపల్లి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ సీఈవో వాసుదేవరావు తెలిపారు. ఆదివారం మండలంలో తొలిరోజు ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు, ప్రక్రియ కొనసాగుతున్న తీరును ఎంపీడీఓ లాలం సీతయ్యను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీవో జయప్రకాష్, స్థానిక ఈవో రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అంబేద్కర్ పాల్గొన్నారు.


