మాకవరపాలెం: పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్‌కుమార్ సూచించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో చెస్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక పఠనంతో జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవచ్చన్నారు. ఖాళీ సమయాల్లో టీవీలు, సెల్ ఫోన్లు వీక్షించకుండా గ్రంథాలయంలో ఉండే విలువైన పుస్తకాలను చదవాలన్నారు. ఇక్కడ పుస్తకాలు చదివి ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారని వివరించారు. గ్రంథాలయ కార్యదర్శి కుమార్‌రాజా మాట్లాడుతూ ల్రైబ్రరీకి రావడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం చెస్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం అధ్యక్ష, కార్యదర్శలు రంగరాజు, శేషగిరిరావు, లైబ్రేరియన్ చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


