మాకవరపాలెం: బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రుత్తల రమేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలోని పైడిపాల గ్రామానికి చెందిన రమేష్ బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పెదబొడ్డేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. రమేష్‌తోపాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ నాయకులు బొడ్డు గోవిందరావు, రుత్తల శ్రీను, బేతా అప్పలరాజు పాల్గొన్నారు.


