ఆటోలు, కార్లకు అనుమతి
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం – నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో విజయరామరాజుపేటలో డైవర్షన్ రోడ్డు పనులు తాత్కాలికంగా చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాచేరు నదిపై డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. ఆర్అండ్బీ అధికారులు డైవర్షన్ రోడ్డుపై కొట్టుకుపోయిన గొట్టాలను వేసి గ్రావెల్‌తో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. 20 రోజులుగా అనకాపల్లి, చోడవరం, విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం మరమ్మతులు చేపట్టడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లకు అనుమతించారు. పూర్తిస్థాయిలో డైవర్షన్ రోడ్డు పనులైన తర్వాత ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలు విడిచి పెట్టనున్నారు.


