శ్రీవారి పుష్పయాగానికి పువ్వులు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి పుష్పయాగానికి పువ్వులు

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ఎంవీపీ కాలనీ: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశాఖ నుంచి భారీ సంఖ్యలో పువ్వులు పంపించారు. కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పూలను సేకరించారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్‌ వద్ద భక్తుల సందర్శనార్థం ఈ పూలను ఆదివారం ప్రదర్శించారు. తొలుత మహిళా భక్తులు పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్‌ చేశారు. అనంతరం సంకల్పం చేసి శాస్త్రోక్తంగా పుష్పయాగం కొరకు తిరుమలకు ఈ పూలు తరలించారు. వీటిలో 3 వేల కలువలు, 3 వేల తామరలతో పాటు వివిధ రకాలకు చెందిన పువ్వులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement