రావికమతం: కార్తీక మాసం సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణపులోవ వద్ద పోతురాజుబాబును దర్శించుకొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌లో నీటిమట్టం అధికంగా ఉండటంతోపాటు నాచు, తీగలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లి స్నానాలు చేయొద్దని ఎస్‌ఐ సూచించారు. పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.


