విశాఖ మాస్టర్స్‌ అథ్లెట్ల సత్తా | - | Sakshi
Sakshi News home page

విశాఖ మాస్టర్స్‌ అథ్లెట్ల సత్తా

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో 11 పతకాలు కై వసం

మురళీనగర్‌: ఈ నెల 14, 15 తేదీల్లో నెల్లూరులో నిర్వహించిన 46వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో విశాఖ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఎల్‌వీ సుధాకర్‌ 45+ విభాగంలో మూడు బంగారు, 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య, 5 కిలోమీటర్ల నడక పోటీలో కాంస్య, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నారు. సనపల జయకృష్ణ (40+ విభాగం) 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, అమరరాణి (40+ విభాగం) 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాలు, లాంగ్‌ జంప్‌లో రజత పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement