గిరిజన కళలు, సంస్కృతి వేదిక ఆది బజార్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజన కళలు, సంస్కృతి వేదిక ఆది బజార్‌

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ఏయూ క్యాంపస్‌: జనజాతీయ గౌరవ దివస్‌ను పురస్కరించుకుని, భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైఫెడ్‌(ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం) బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ వద్ద ‘ఆది బజార్‌’ను ఏర్పాటు చేసింది. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన, విక్రయాల కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌ ప్రదర్శన, విక్రయాలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను, ప్రదర్శించిన సంప్రదాయ కళారూపాలను తిలకించారు. కార్యక్రమంలో ట్రైఫెడ్‌ ప్రాంతీయ మేనేజర్‌ భాస్కర్‌ ఝా, అసిస్టెంట్‌ మేనేజర్‌ కె. రాంబాబు పాల్గొన్నారు.

ఆది బజార్‌ ప్రత్యేకతలు

ఈ బజార్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మంది గిరిజన కళాకారులు పాల్గొంటున్నారు. సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, చిత్రకళా ఉత్పత్తులు, ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, ఇతర దేశీయ గిరిజన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం ద్వారా ఆదివాసీల ఆర్థిక సాధికారతకు తోడ్పడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ‘ఆది బజార్‌’వేదికగా కళాకారులు నేరుగా వినియోగదారులతో అనుసంధానమై, తమ ఉత్పత్తులను విక్రయించడంతో పాటు గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉంటుందని ట్రైఫెడ్‌ ప్రాంతీయ మేనేజర్‌ భాస్కర్‌ ఝా వివరించారు. ఇలాంటి ప్రదర్శనలు గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు, సంప్రదాయ కళలు, హస్తకళల పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఆదివాసీ చిత్రకళా రూపాలు

వైఎంసీఏ వద్ద ఈ నెల 24 వరకు గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement