రైతుల ఆదాయానికి విద్యుత్‌ శాఖ గండి | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆదాయానికి విద్యుత్‌ శాఖ గండి

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

నాతవరం: విద్యుత్‌ తీగలకు అడ్డంగా ఉన్నాయని విలువైన టేకు చెట్లను ఆ శాఖ సిబ్బంది నరికివేస్తున్నారు. ఇటీవల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యుత్‌ వైర్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించారు. మర్రిపాలెం, వెన్నలపాలెం, నాతవరం గ్రామాల్లో విలువైన భారీ టేకు వృక్షాలను రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు తొలగించారు. వాస్తవంగా వెన్నలపాలెం, మర్రిపాలెం గ్రామాల్లో తొలగించిన చెట్లు విద్యుత్‌ లైను ఏర్పాటు చేయకముదే వేసుకున్నారు. ఇటీవల నాతవరం నుంచి కొత్తగా విద్యుత్‌ లైను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆయా కాంట్రాక్టరు గాని విద్యుత్‌ అఽధికారులు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రైతుల సొంత భూముల్లో స్తంభాలు, వైర్లు వేసేశారు. ఇప్పుడు విద్యుత్‌ తీగలకు వృక్షాలు అడ్డంగా ఉన్నాయని ఇష్టానుసారంగా నరికివేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం ఇస్తే తాము నరికి సొంత అవసరాలకు వాడుకునే వాళ్లమని చెబుతున్నారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది ధ్వంసం చేసిన భారీ వక్షాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తీగలకు తగులుతున్నాయని విలువైన టేకు చెట్ల నరికివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement