అనకాపల్లి: గ్రామాల్లో జరిగే గ్రామ సర్పంచ్‌లు, వార్డు మెంటర్లు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉంటుందని ఆపార్టీ మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్ వర్మలు అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్ రాజా ఆధ్వర్యంలో మండల సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌లు, వార్డు మెంటర్లు ఎన్నికలు ఈనెల 26 జరుగుతున్నాయని, మండల పరిధిలో 32 పంచాయతీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, మాజీ ఎంపీపీ గొర్లి సూరిబాబు, అన్నపూర్ణ బ్యాంక్ మాజీ చైర్మన్ పి.డి.గాంధీ పాల్గొన్నారు.


