క్లీన్‌ ఆఫ్‌ డేలో జి.మాడుగుల గురుకులానికి ప్రత్యేక గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

క్లీన్‌ ఆఫ్‌ డేలో జి.మాడుగుల గురుకులానికి ప్రత్యేక గుర్తింపు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

జి.మాడుగుల: స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల నిర్వహిస్తున్న క్లీన్‌ ఆఫ్‌ డే కార్యక్రమాల్లో జి.మాడుగుల గురుకుల కళాశాల ఉత్తమ ప్రతిభ కనబరిచిందని ఏపీ నెట్‌ జీరో క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ పాంగి మత్స్యకొండబాబు తెలిపారు. జూలై నుంచి నవంబర్‌ వరకు కళాశాల సాధించిన ఈ గుర్తింపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రిన్సిపాల్‌, నోడల్‌ టీచర్‌, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ కళాశాల సర్టిఫికెట్‌ను నోడల్‌ టీచర్‌ లక్ష్మీనారాయణ, విద్యార్థులకు అందజేశారు. మత్స్యకొండబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ నెట్‌ జీరో హెల్తీ క్యాంపస్‌ కార్యక్రమంలో భాగంగా, ఫారెస్ట్‌ బై హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ సహకారంతో జి.మాడుగుల గురుకుల కళాశాలకు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌–స్పెషల్‌ రికగ్నిషన్‌ లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ గుర్తింపు కేవలం సర్టిఫికెట్‌ మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు చేసిన కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. నెట్‌ జీరో క్లీన్‌ ఆఫ్‌ డ్రైవ్స్‌లో కళాశాల చూపిన చొరవ, పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణంగా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను ఈ గుర్తింపు ప్రతిబింబిస్తోందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజం పట్ల బాధ్యత, ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ పారయ్య, నోడల్‌ టీచర్‌ లక్ష్మినారాయణ, అధ్యాపకులు, సిబ్బంది రాము, గణేష్‌, నూకరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement