● జిల్లా ఎల్సీసీ చైర్పర్సన్ కృష్ణకుమారి
ముంచంగిపుట్టు: విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఎల్సీసీ చైర్పర్సన్ కె.కృష్ణకుమారి అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణకుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులు, మహిళల రక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్ యాదవ్, స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబు, వైస్ చైర్మన్ వెంకటలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ పర్వతాలు, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


