నామినేషన్ల స్వీకరణపైఆర్వోలకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల స్వీకరణపైఆర్వోలకు శిక్షణ

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

కొయ్యూరు: నామినేషన్ల స్వీకరణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, చేపట్టాల్సిన చర్యలపై శనివారం రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆర్‌వోలకు శిక్షణ ఇచ్చారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఉపసంహరణ పూర్తయి అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. ప్రతి సమాచారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శించే విధానంపై అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రసాదరావు మాట్లాడుతూ.. మండలంలోని 13 క్లస్టర్లకు నామినేషన్‌ ఫారాలతో పాటు ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తిచేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement