ఆధునిక భారత నిర్మాత నెహ్రూ | - | Sakshi
Sakshi News home page

ఆధునిక భారత నిర్మాత నెహ్రూ

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఇస్కఫ్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మాధవరావు

అనకాపల్లి: ఆధునిక భారతదేశ అభివృద్ధికి, నిర్మాణానికి మాజీ ప్రధాని దివంగత జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంతో కృషి చేశారని ఇస్కఫ్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు తెలిపారు. ఇస్కఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక సీపీఎం కార్యాలయంలో శనివారం ప్రత్యేక చర్చా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాధవరావు మాట్లాడుతూ నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించి, భారీ పరిశ్రమలను స్థాపించి దేశాన్ని వ్యవసాయ, పారిశ్రామికంగాను అభివృద్ధి చేశారన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అవలంబిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాలు ధరల పెరుగుదలకు దారి తీస్తూ సామాన్యుడిపై భారం మోపుతున్నాయన్నారు. పలు సంఘాల నాయకులు విల్లూరి పైడారావు, పీలా హరిశ్రీనివాస్‌, బొట్టా చిన్నయాదవ్‌, బొడ్డేడ అప్పారావు, వై.ఎన్‌.భద్రం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు హోంమంత్రి పరామర్శ

అక్కిరెడ్డిపాలెం : ఎస్‌.రాయవరం మండలం కొత్త పోలవరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి, షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయగా, నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement