విద్యార్థుల విజయాలే ఉన్నత స్థితికి ప్రేరణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల విజయాలే ఉన్నత స్థితికి ప్రేరణ

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

పాయకరావుపేట : విద్యార్థుల విజయాలు, ఉన్నతస్థితికి చేరడానికి ప్రేరణగా నిలుస్తాయని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, 18 వ ఆంధ్రా ఎన్‌సీసీ బెటాలియన్‌, కాకినాడ మేజర్‌ మొహమ్మద్‌ అసిఫ్‌ అన్నారు. శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్ధలలో వారం రోజులుగా నిర్వహిస్తున్న రిమ్‌ జిమ్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేసారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్ధల తుని, పాయకరావుపేట, అన్నవరం విద్యార్ధులు సుమారు 5800 మందికి సాహిత్యం, సంగీతం, ఆటలు, క్రీడలు, లలిత కళలు, థియేటర్‌ ఆర్ట్స్‌, సైన్స్‌ వంటి అనేక అంశాల మీద జూనియర్‌, సబ్‌ జూనియర్‌, సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ విభాగాలలో 31 రకాల పోటీలు నిర్వహించి ముఖ్యఅతిథి చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల అతిథులకు ఏర్పాటు చేసిన చర్చావేదికలో స్క్రోలింగ్‌ లేదా పఠనం నేర్చుకోవడం.. అత్యంత తెలివైన మార్గం ఏది? అనే అంశం పై తమ అభిప్రాయాలును వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్ధేశించి అతిథి మొహమ్మద్‌ అసిఫ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులకు వారికి ఆసక్తి వున్న రంగాన్ని ఎంచుకునే వేసులుబాటు కల్పించాలని అన్నారు.

విద్యార్ధులు అనవసర విషయాల్లో జోక్యం మాని భవిష్యత్‌ లక్ష్యం కోసం అనునిత్యం శ్రమపడాలని అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరని ఉద్బోధించారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల నుండి పొందే ప్రేరణ వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి, రిమ్‌ జిమ్‌ కన్వీనర్‌ గౌతమి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement