లారీ ఢీకొని తల్లీకూతుళ్లు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని తల్లీకూతుళ్లు దుర్మరణం

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

నక్కపల్లి : జాతీయరహదారిపై శనివారం అడ్డురోడ్డు జంక్షన్‌ దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే నక్కపల్లి మండలం చినతీనార్లకు చెందిన వాసపల్లి నూకతల్లి (51) తన కుమార్తె వాసపల్లి సత్యకుమారి అలియాస్‌ రత్నం(26), అల్లుడు ఓరిపిల నారాయణతో కలిసి తన అల్లుడికి చెందిన మోటారు సైకిల్‌పై రాంబిల్లి వెళ్తున్నారు. అడ్డురోడ్డు ఫ్లై వోవర్‌ బ్రిడ్జి దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నూకతల్లి, సత్యకుమారిలు లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు నుజ్జయ్యాయి. బైక్‌ నడుపుతున్న నూకతల్లి అల్లుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వీరి మరణ వార్త తెలిసి చినతీనార్లలో విషాద ఛాయలలు అలముకున్నాయి. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.రాయవరం పోలీసులు తెలిపారు.

సత్యకుమారికి 3 నెలల క్రితమే వివాహం

కాగా ఈ ప్రమాదంలో మరణించిన సత్యకుమారికి ఇదే గ్రామానికి చెందిన ఒరిపిల నారాయణతో మూడు నెలల క్రితమే వివాహం జరిగినట్టు తెలిసింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం ఆమెను కబళించింది. మృతులు ఇద్దరూ పెదతీనార్ల మాజీ సర్పంచ్‌ మేరిగి కొర్లయ్యకు సోదరి, మేనకోడలు అవుతారని తెలిసింది.

సత్యకుమారి (ఫైల్‌)

నూకరత్నం (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement