బైక్‌ను ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

● ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు ● ధర్మసాగరంలో ఘటన

నర్సీపట్నం: నర్సీపట్నం నుంచి కోటవురట్ల వెళ్లే ప్రధాన రహదారిలోని ధర్మసాగరం జంక్షన్‌ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ రేవతమ్మ పరిశీలించారు. రూరల్‌ ఎస్సై రాజారావు తెలిపిన వివరాలు.. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి కొత్తవీధికి చెందిన బి.కార్తీక్‌, దుర్గాప్రసాద్‌, మరొక వ్యక్తి కారులో ప్రయాణిస్తున్నారు. కారును బి.కార్తీక్‌ నడుపుతున్నాడు. వీరు కోటవురట్ల నుంచి నర్సీపట్నం అతివేగంగా వస్తున్నారు. ధర్మసాగరం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న పల్సర్‌ బైక్‌ను బలంగా ఢీ కొట్టి, విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ పక్కన కూర్చున్న నాతవరం మండలానికి చెందిన దుర్గాప్రసాద్‌ తలకు తీవ్ర గాయమైంది. 108 వాహనంలో సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కారు నడుపుతున్న కార్తీక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తికి గాయాలు కాలేదు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురికి కాళ్లు విరిగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement