బీజేపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

బీజేపీ, జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

అచ్యుతాపురం రూరల్‌ : మండలంలోని మళ్లవరం గ్రామానికి చెందిన బీజేపీ, జనసేన నాయకులు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. బీజేపీ నాయకుడు బొందల లోవరాజు, జనసేన నాయకుడు ఇంటి శివాజీ ఇరువురుతో పాటు మరో 20 మంది అనుచరులు వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల నాయకులు కోన బుజ్జి, నర్మాల కుమార్‌, భీముని వెంకటేశ్వర్రావు, పిన్నంరాజు రవీంద్రరాజు పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement