అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై చర్చ జరుగుతున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. కానీ జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరమన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్


