● రాష్ట్రపతి భవన్‌కు ఏపీ నుంచి అవకాశం
గూడెంకొత్తవీధి: గూడెం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న మెట్టపాటి చినబాబు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. విద్యలో కనబరిచిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. హ్యూమానిటీస్ విభాగంలో 9204 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి అరుదైన అవకాశం దక్కడం ఆనందంగా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


