పాడేరు రూరల్: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం వివిధ రంగాల కార్మికులతో కలిసి ముట్టడి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లందరినీ పర్మినెంట్ చేయడంతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలకులు నేటికీ స్పందించడం లేదన్నారు. ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులు ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి
సుందర్‌రావు


