చుట్టూ ఎత్తయిన పచ్చని కొండలు.. స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన జీవనం.. ఇదంతా గిరిజనులకే సొంతం. ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల రంగబయలు పంచాయతీ మట్టిగూడ గ్రామంలో సోంబ్ర అనే గిరిజనుడు నివసిస్తున్న ప్రాంతం చూపరులను ఆకట్టుకుంటోంది. పూరి గుడిసె అయినప్పటికీ చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో ఆ ప్రాంతం చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలా కనువిందు చేస్తోంది. ప్రకృతితో మమేకమైన గిరిజన జీవనశైలికి ఈ ప్రాంతం అద్దం పడుతోంది.
– ముంచంగిపుట్టు


