సీలేరు: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తొలిసారిగా నిర్మించిన ఏపీ జెన్‌కో సీలేరు డ్యామ్‌తో పాటు సీలేరు కాంప్లెక్స్‌లోని పలు జలాశయాలను రాష్ట్ర డ్యామ్ భద్రత కమిటీ సభ్యులు గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. మోతుగూడెం, డొంకరాయి, సీలేరు డ్యామ్‌లను సందర్శించి వాటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు.
పటిష్టత పరిశీలన
సీలేరు ఇంటెక్ డ్యామ్, రెగ్యులేటర్ డ్యామ్, గుంటవాడ డ్యామ్ గేట్ల పనితీరును పరిశీలించారు. డ్యామ్‌ల కాంక్రీట్ నిర్మాణాలు, గేట్ల ఎత్తడం, దించడం, నీటి విడుదల సమయంలో కాంక్రీట్ పిల్లర్ల పరిస్థితి, ఆనకట్టల పటిష్టతను తనిఖీ చేశారు. వర్షాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు డ్యామ్‌లు, గేట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయనే అంశాలపై స్థానిక జెన్‌కో అధికారు లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన లో భాగంగా సుమారు 400 ఫొటోలను సేకరించారు.
కేంద్రానికి నివేదిక
డ్యామ్‌ల భద్రతకు సంబంధించి గుర్తించిన సమస్యలు, లోపాలపై జెన్‌కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ బృందంలో రిటైర్డ్ సీఈ (సివిల్) కోటేశ్వరరావు, బి.చంద్రశేఖర్‌రెడ్డి, జీవీఎస్‌ఈ స్వామి ప్రసాద్ ఉన్నారు. పరిశీలనలో స్థానిక జెన్‌కో అధికారులు ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, ఏడీ జైపాల్, ఏఈఈలు సురేష్, సందీప్ పాల్గొన్నారు.


