తుపాను బాధితులందరికీ సరకులు పంపిణీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులందరికీ సరకులు పంపిణీ చేయాలి

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

● రేషన్‌ ట్రాక్టర్‌ను అడ్డుకున్న స్థానిక పేదలు

● రేషన్‌ ట్రాక్టర్‌ను అడ్డుకున్న స్థానిక పేదలు

రేషన్‌ సరకుల ట్రాక్టరును అడ్డగించిన నిరుపేదలు, ఎంపీటీసీ జగతా శ్రీను

పాయకరావుపేట: తుపాను ప్రభావం అందరిపైనా ఉన్నందున బాధితులందరికీ రేషన్‌ సరకులు పంపిణీ చేయాలని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, రెండో సెగ్మెంట్‌ ఎంపీటీసీ సభ్యుడు జగతా శ్రీను డిమాండ్‌ చేశారు. తుపాను నేపథ్యంలో పట్టణంలోని 114 మంది చేనేత కార్మికులకు రేషన్‌ సరకులు పంపిణీ చేసేందుకు రెండో నంబరు రేషన్‌ డిపోకు ట్రాక్టర్‌పై సరకులు తీసుకురాగా, సమీప ప్రాంతాలకు చెందిన ఇతర పేదలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగతా శ్రీను మాట్లాడుతూ తుపాను ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందని, కేవలం చేనేత కార్మికులకే రేషన్‌ సరకులు పంపిణీ చేయడం సమంజసం కాదన్నారు. సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఇతర పేదలకు కూడా సరకులు అందించాలని కోరారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సమస్యపై స్పందించి అర్హులైన పేదలందరికీ రేషన్‌ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సివిల్‌ సప్లైస్‌ డీటీ గణపతిరావును సంప్రదించగా.. పట్టణంలోని 114 మంది చేనేత కార్మికులకు మాత్రమే ప్రభుత్వం రేషన్‌ సరకులు మంజూరు చేసిందని, వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

పోక్సో కేసులో యువకుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement