డిఫెన్స్‌ అకాడమీ నుంచి విద్యార్థి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ అకాడమీ నుంచి విద్యార్థి అదృశ్యం

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

● తండ్రిపై కోపంతో వెళ్లిపోయినట్లు ఫిర్యాదు

సబ్బవరం: స్థానిక రేంజర్స్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ విద్యార్థి అదృశ్యమైన ఘటనపై సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలివి. నాతవరం గ్రామానికి చెందిన మామిడి సంతోష్‌ కుమార్‌(16) అకాడమీలో చదువుతున్నాడు. ఈ నెల 7న సాయంత్రం 4.30 గంటల సమయంలో కళాశాల యాజమాన్యానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అకాడమీ నుండి బయటకు వెళ్లిపోయాడు. దీపావళి పండగకు ఇంటికి రావద్దని, అక్కడే ఉండాలని తండ్రి వీరబాబు చెప్పడంతో మనస్తాపానికి గురై, కోపంతో బయటకు వెళ్లిపోయాడు. విద్యార్థి ఆచూకీ తెలియకపోవడంతో డిఫెన్స్‌ అకాడమీ ప్రిన్సిపాల్‌ పోతల సత్యనారాయణ పోలీస్‌లకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సీఐ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement