సాక్షి, పాడేరు: నాగులచవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు మన్యం సిద్ధమైంది. నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మత్స్యగుండంలో కొలువైన నాగదేవతల దర్శనానికి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి నాగదేవతల మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీటితోపాటు హుకుంపేటలోని మోదకొండమ్మతల్లి ఆలయం, పెదగరువు, సూకూరు, పాడేరులోని పోలుపుట్ట, తుమ్మరిమెట్ట ప్రాంతాల్లోని నాగమందిరాలు సైతం పూజలకు సిద్ధమయ్యాయి.


