జెడ్పీ పీఠం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం

Nov 13 2026 12:58 AM | Updated on Nov 13 2026 12:58 AM

రాజకీయంగా అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలకు అగ్రస్థానం కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి జిల్లా పరిషత్‌ తొలి పీఠాన్ని మరోసారి పీవీటీజీ మహిళకు కేటాయించి ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ పీఠాన్ని గతంలో జల్లిపల్లి సుభద్రకు అవకాశం కల్పించగా.. ఇప్పుడు పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. మరోవైపు వైస్‌ చైర్మన్‌గా కొండదొర సామాజిక వర్గానికి చెందిన సీదరి రాంబాబును ఖరారు చేశారు.

సాక్షి, పాడేరు: ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వేరుపడి 11 మండలాలతో నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్‌కు తొలి చైర్‌పర్సన్‌గా ఆదివాసీ మహిళకు అవకాశం దక్కింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడు జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడంతో జిల్లా పరిషత్‌ పీఠం ఆ పార్టీ కి దక్కింది. ఎస్టీ జనరల్‌కు కేటాయించిన చైర్మన్‌ పదవికి గెలుపొందిన ఏడుగురు జెడ్పీటీసీలు అర్హులే అయినప్పటికీ.. వెనుకబడిన ఎస్టీ కోదు సామాజిక వర్గానికి చెందిన పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతికి అవకాశం కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై గిరిజన ప్రాంతాల్లోని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

● 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్మన్‌ పదవిని ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. ఈ పదవిని ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా గెలుపొందిన జల్లిపల్లి సుభద్రకు జగన్‌ అవకాశం కల్పించారు. ఆమె కూడా అత్యంత వెనుకబడిన పీవీటీజీ తెగకు చెందినవారే. ఇప్పుడు రెండోసారి కూడా పీవీటీజీ సామాజిక వర్గానికి జెడ్పీ పీఠం కేటాయించడంతో ఆయా తెగల గిరిజనులు జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

● తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు దూరు జయవర్ధిని, కిముడు హరి, ఒంటుబు ప్రియాంక, వంతాల శాంతి, సీదరి రాంబాబు, కోరాబు అనూషాదేవి, కంకిపాటి గిరిప్రసాద్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అధిక మెజార్టీతో విజయం సాధించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సేవలకు దక్కిన ప్రతిఫలం

జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఈ నెల 20న పెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీ బంగారుమామిడి గ్రామానికి చెందిన ఆమె గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున కిముడుపల్లి ఎంపీటీసీగా విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పెదబయలు మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె భర్త వంతాల అప్పారావు వైఎస్సార్‌సీపీలో కీలక పదవులు నిర్వహించారు. వంతాల శాంతి ఎస్టీలోని వెనుకబడిన కోదు సామాజిక వర్గానికి చెందినవారు.

కొండదొర సామాజిక వర్గానికి..

జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పాడేరు జెడ్పీటీసీ సీదరి రాంబాబును వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఆయన కూడా ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాడేరు మండలం డి.గొందూరు గ్రామానికి చెందిన రాంబాబు ఎస్టీలోని కొండదొర సామాజిక వర్గానికి చెందినవారు. గతంలో రెండుసార్లు డి.గొందూరు సర్పంచ్‌గా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. ఉత్తమ సర్పంచ్‌గా రాష్ట్రపతి నుంచి రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. తాజా ఎన్నికల్లో పాడేరు జెడ్పీటీసీగా అధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు వైస్‌ చైర్మన్‌ పదవి ఖరారు కావడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసీ

మహిళకు

జెడ్పీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీపెదబయలు జెడ్పీటీసీ వంతాల శాంతి

వెనుకబడిన ఎస్టీ కోదు సామాజిక వర్గానికి కేటాయింపు

వైస్‌ చైర్మన్‌గా సీదరి రాంబాబు

20న ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement