పాడేరు రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర, బాలికల వాలీబాల్ క్రీడా పోటీలు రెండో రోజు గురువారం హోరాహొరీగా జరిగాయి. ఈ సందర్భంగా పోటీలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర క్రీడా పరిశీలకుడు మురళీకృష్ణ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి భూపతిరాజు, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి పాంగి సూరిబాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 312 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని హితవుపలికారు. అడ్మిన్ సెక్రటరీ లక్ష్మిపార్వతి, వ్యాయామ ఉపాధ్యాయుడు కొండబాబు, కోచ్‌లు శ్రీనివాస్, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


