ఆరు కిలోమీటర్లు నడిచి.. వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

ఆరు కిలోమీటర్లు నడిచి.. వైద్య సేవలు

Nov 13 2026 12:58 AM | Updated on Nov 13 2026 12:58 AM

కొయ్యూరు: పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందించి.. మారుమూల గిరిజన గ్రామానికి వైద్య సేవలు అందించేందుకు ఓ వైద్యుడు సాహసయాత్ర చేశారు. రహదారి సౌకర్యం లేకపోయినా.. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఎత్తైన కొండలు ఎక్కి జాజులబంధకు చేరుకున్నారు. అక్కడ జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులకు వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. డౌనూరు వైద్యుడు వినయ్‌కుమార్‌ గురువారం జాజులబంధలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయని పత్రికల్లో కథనాలు రావడంతో స్పందించి కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ సందర్శించి అనారోగ్యంతో ఉన్న వారిని పరీక్షించి అవసరమైన సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. మొత్తం 35 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

కొండలు ఎక్కి.. జాజులబందజ్వర బాధితులకు భరోసా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement