జీసీసీకి ఉత్పత్తుల విక్రయంతో గిరిజన రైతులకు మేలు | - | Sakshi
Sakshi News home page

జీసీసీకి ఉత్పత్తుల విక్రయంతో గిరిజన రైతులకు మేలు

Nov 13 2026 12:58 AM | Updated on Nov 13 2026 12:58 AM

చింతపల్లి: గిరిజన రైతులు సేకరించిన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థకి విక్రయించడం ద్వారా మంచి గిట్టుబాటు ధరలు పొందవచ్చని బ్రాంచ్‌ మేనేజర్‌ సుగుదాధం అన్నారు. గురువారం నరహరివీధిలో రైతుల నుంచి వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల కొనుగోళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు పండించిన, సేకరించిన పంటలు, అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారీ వ్యాపారుల చేతిలో రైతులు నష్టపోకుండా ముందుగానే మెరుగైన గిట్టుబాటు ధరలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కాఫీ, మిరియాలు, పసుపు, చింతపండు, షీకాయి, తేనె, కొండచీపుర్లు తదితర 25 రకాల వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని వివరించారు. ఉత్పత్తుల కొనుగోలుతో పాటు అవసరమైన రైతులకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement