ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● కలెక్టర్‌ నిశాంతి

సాక్షి, పాడేరు: స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 138వ జయంతిని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్‌ చిత్రపటానికి కలెక్టర్‌ టి. నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌ కలెక్టర్‌ నాగ వెంకట సాహిత్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీల సంక్షేమ దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ దేశానికి అందించిన సేవలను వివరించారు. విద్యారంగ అభివృద్ధికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement