విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

పెదబయలు: చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ శశికుమార్‌ అన్నారు. మంగళవారం పెదబయలు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ను సందర్శించి ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలపై అవగాహన కల్పించారు. మధ్యలో చదువు మానేసిన వారు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్‌ చదువుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 30 వరకు ప్రవేశాలకు గడువు ఉందని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి కృష్ణమూర్తి, పాఠశాల హెచ్‌ఎం శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement