కొయ్యూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. మంగళవారం కంపమామిడి, కంఠారం పీహెచ్సీల పరిధిలోని గ్రామాలను ఆమె సందర్శించారు. ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు, చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని కోరారు. జ్వర బాధితులకు రక్తపూతలు సేకరించడంతోపాటు, ప్రభు త్వం పంపిణీ చేసిన దోమతెరలను రాత్రివేళ విధిగా వినియోగించాలని సూచించారు.


