పార్టీ కోసం శ్రమించిన నేతలకు ఓటర్ల పట్టం | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం శ్రమించిన నేతలకు ఓటర్ల పట్టం

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

పెదబయలు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు స్థానిక ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారు. వైఎస్సార్‌సీపీ అరకు నియోజకవర్గ సోషల్‌ మీడియా విభాగం కో–కన్వీనర్‌ మెల్లాకి ప్రవీణ్‌కుమార్‌ కిముడుపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ సాధించారు. పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామానికి చెందిన ఆయన 2019 నుంచి మండల వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగంలో చురుగ్గా పనిచేశారు. 2022లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అరకు నియోజకవర్గ సోషల్‌ మీడియా విభాగం కో–కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ఆదేశాల మేరకు సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కిముడుపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్‌ 1,041 ఓట్లు సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి కొర్ర భీమరాజుపై 638 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మండలంలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా ప్రథమ స్థానంలో నిలిచారు. అల్లూరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల మెజారిటీల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

మండల పార్టీ అధ్యక్షుడికి రెండో స్థానం

పెదబయలు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మజ్జి చంద్రుబాబు జామిగుడ ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేశారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ బలోపేతానికి ఆయన విశేషంగా కృషి చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై 549 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మండలంలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో రెండో స్థానంలో నిలిచారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకులకు ఓటర్లు తమ తీర్పుతో గుర్తింపు ఇచ్చారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

మజ్జి చంద్రుబాబు

మెల్లాకి ప్రవీణ్‌కుమార్‌

కిముడుపల్లి సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో–కన్వీనర్‌కుభారీ మెజారిటీ

మండలంలో అత్యధిక మెజారిటీ.. అల్లూరి జిల్లాలో మూడో స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement